Singareni: సింగరేణి సీఎండీగా బలరాం నాయక్

Balaram Naik Appointed As Singareni New CMD

  • ముగిసిన ఎన్. శ్రీధర్ పదవీకాలం
  • జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం
  • బలరాం నాయక్ కు అదనపు బాధ్యతల అప్పగింత

సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ని నియమించింది. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ) లో రిపోర్ట్ చేయాలని శ్రీధర్ కు సూచించింది. ఆయన స్థానంలో కొత్త సీఎండీగా బలరాం నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ఎస్ అధికారి అయిన బలరాం నాయక్ ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఫైనాన్స్ తో పాటు వెల్ఫేర్ బాధ్యతలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. వీటితో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలను బలరాం నాయక్ స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News