Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా...!

Google maps brings new feature for real time location sharing
  • లొకేషన్ షేరింగ్ కోసం గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్
  • గతంలో లొకేషన్ షేరింగ్ కోసం వాట్సాప్ పై ఆధారపడే పరిస్థితి
  • గూగుల్ మ్యాప్స్ లో తాజా ఫీచర్ తో ఆ పరిస్థితిలో మార్పు
ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ తో కలిగే లాభం అంతా ఇంతా కాదు. తాజాగా గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్ తీసుకువచ్చారు. ఇది రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైమ్ లొకేషన్ షేర్ చేయాలంటే వాట్సాప్ వంటి ఇతర యాప్ ల ద్వారా పంపించాల్సి వచ్చేది. 

వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేసినప్పుడు అది పరిమిత సమయం పాటు మాత్రమే ఆన్ లో ఉంటుంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లోని కొత్త ఫీచర్ ఆ లోటు తీర్చుతుంది. గూగుల్ మ్యాప్స్ లోని నయా ఫీచర్ ద్వారా పంపే లొకేషన్ అన్ లిమిటెడ్ అని చెప్పాలి. మనం వద్దనుకుని ఆఫ్ చేస్తే తప్ప, ఇది ఎంతసేపైనా ఆన్ లోనే ఉంటుంది. 

ఈ ఫీచర్ ను ఎలా యాక్సెస్ చేయాలంటే...

  • మొదట గూగుల్ మ్యాప్స్ యాప్ లో లాగిన్ అవ్వాలి 
  • కుడివైపున కనిపించే 'ప్రొఫైల్ అకౌంట్' పై క్లిక్ చేయాలి
  • అందులో 'లొకేషన్ షేరింగ్' ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి
  • స్క్రీన్ పై దర్శనమిచ్చే 'న్యూ షేర్' ఆప్షన్ పై క్లిక్ చేస్తే టైమ్ సెట్ చేసుకోవచ్చు
  • లేకపోతే, Until you turn this off అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. 
  • ఆ తర్వాత కాంటాక్ట్ నెంబరు సెలెక్ట్ చేసుకుని మెసేజ్ పంపితే సరి... లొకేషన్ షేరింగ్ పూర్తయినట్టే.
  • ఒకవేళ లొకేషన్ షేరింగ్ ను ఆఫ్ చేయాలనుకుంటే, మళ్లీ ప్రొఫైల్ అకౌంట్ లోకి వచ్చి 'స్టాప్ షేరింగ్' ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
Google Maps
Location Sharing
Real Time
Whatsapp

More Telugu News