Singareni Collieries Company: విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకూడదు: సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Revanth Reddy orders to Singareni CMD

  • ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బలరాం
  • సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎండీ 
  • బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ సింగరేణిని ముందుంచుతానని హామీ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరాంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బలరాం సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.... విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడే పరిస్థితి రాకూడదని అన్నారు. అందుకే సీఎండీ బదులిస్తూ... ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని... సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాల కోసం నిరంతరాయంగా అందిస్తామని బలరాం తెలిపారు. బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాలలోనూ సింగరేణి ముందుండేలా చూస్తానని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో ఈ ఏడాది ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News