CPI Narayana: ఆ మాట చెప్పేందుకే కేసీఆర్ వద్దకు ఏపీ సీఎం జగన్ వచ్చారు: సీపీఐ నేత నారాయణ

CPI Narayana reveals why YS Jagan came to KCR

  • కేసీఆర్, వైఎస్‌ జగన్ భేటీ వ్యూహంలో భాగమేనన్న సీపీఐ నారాయణ
  • పోలింగ్ డే రోజున తెలంగాణతో గొడవ పెట్టుకుంటారా? అని నిలదీత
  • అప్పుడు నీకు సహకారం చేశా.. ఇప్పుడు మీరు సహకారం చేయండని చెప్పేందుకే జగన్ వచ్చారని వ్యాఖ్య

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ వ్యూహంలో భాగమేనని... అప్పుడు నీకు సహకారం చేశా.. ఇప్పుడు మీరు సహకారం చేయండి అని చెప్పడానికే జగన్.. కేసీఆర్ వద్దకు వచ్చారని సీపీఐ నేత నారాయణ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను జగన్ పరామర్శించిన నేపథ్యంలో సీపీఐ నారాయణ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు వారు గొడవ పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నీకు సహకరించాను... ఇప్పుడు మీరు చేయండి అని చెప్పడానికే జగన్ వచ్చాడని విమర్శించారు.

మొన్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పని చేయాలని అనుకున్నామని.. నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిందన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం వచ్చిందని.. కానీ వెళ్లడం లేదన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదని... కానీ ఆయన వెళ్తున్నారని ఆరోపించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసమే రామ మందిర నిర్మాణమని ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ తప్పిదాల వల్లే మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోయి.. బీజేపీ గెలిచిందన్నారు. పార్లమెంట్‌పై దాడి జరిగితే సమాధానం చెప్పలేక ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శించారు. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని... ఇండియా కూటమి బలపడుతోందన్నారు.

  • Loading...

More Telugu News