sridhar babu: పదేళ్ల పాటు కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు: మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు

Minister Sridhar Babu comments on previous KCR government

  • ప్రజలు మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన్న శ్రీధర్ బాబు
  • తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు ప్రారంభించామన్న మంత్రి
  • ప్రజలను అవమానించేలా పాలన సాగించారని విమర్శ   

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల్ని అవమానిస్తూ పాలన సాగించారని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు సుపరిపాలన కోరుకున్నారని.. అందుకే మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన్నారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేశామన్నారు. కానీ కేసీఆర్ రెండోసారి గెలిచాక రెండు నెలల వరకు కేబినెట్‌ను కూడా విస్తరించలేదని విమర్శించారు.

పదేళ్ల పాటు కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారన్నారు. ప్రజలను అవమానించేలా పాలన సాగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతోందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని... ఇప్పటి వరకు 6.50 కోట్ల జీరో టిక్కెట్లు జారీ చేసినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News