David Warner: దొరికిన టోపీలు.. డేవిడ్ వార్నర్ హర్షం

David warner happy after finding his lost caps
  • ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఉంటున్న హోటల్‌లో దొరికిన టోపీలు
  • ఇన్‌స్టా వేదికగా విషయం చెప్పిన వార్నర్
  • భుజాలపై రెండు రోజులుగా ఉన్న భారం దిగిపోయిందని వ్యాఖ్య
  • ఈ టోపీలు ఎంత ప్రత్యేకమో ప్రతి క్రికెటర్‌కూ తెలుసునని కామెంట్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టోపీలు ఎట్టకేలకు దొరికాయి. ఆస్ట్రేలియా జట్టు ఉంటున్న హోటల్‌లోనే రెండు బ్యాగీ గ్రీన్ టోపీలున్న బ్యాగు కనిపించింది. ఈ విషయాన్ని వార్నర్ ఇన్‌స్టాలో వెల్లడించారు. పోయాయనుకున్న టోపీలు తిరిగి లభించినందుకు హర్షం వ్యక్తం చేశాడు. 

‘‘నా బ్యాగీ గ్రీన్ టోపీలు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. గొప్ప ఉపశమనం లభించింది. ఈ టోపీ ఎంత ప్రత్యేకమో ప్రతి క్రికెటర్‌కూ తెలుసు. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. టోపీలు నాకు చేరడానికి సాయపడ్డ వారందరికీ రుణపడి ఉంటా. గత రెండు రోజులుగా భుజాలపై ఉన్న భారం మొత్తం దిగిపోయినట్టు అనిపిస్తోంది. రవాణా సంస్థ క్వాంటస్‌కు, హోటల్‌కు, టీం మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు’’ అని వార్నర్ వీడియో షేర్ చేశాడు. వార్నర్ ప్రస్తుతం తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే.
David Warner
Australia
Crime News

More Telugu News