Lavu Sri Krishna Devarayulu: పోటీ నుంచి తప్పుకుంటా: వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

I will not contest next elections says YSRCP MP Lavu Sri Krishna Devarayulu
  • గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని లావుకు చెప్పిన జగన్
  • గుంటూరు నుంచి పోటీ చేయలేనన్న లావు
  • నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వాలనుకుంటున్న జగన్
వైసీపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించారు. అయితే, తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని జగన్ కు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచే లావుకు టికెట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం చెప్పినప్పటికీ జగన్ నిరాకరించారు. దీంతో, గుంటూరు నుంచి తాను పోటీ చేయలేనని, ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటానని లావు స్పష్టం చేశారు. నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వాలనుకుంటున్నట్టు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.
Lavu Sri Krishna Devarayulu
YSRCP
Jagan

More Telugu News