India-A: భారత్ పర్యటనకు వస్తున్న ఇంగ్లండ్ జట్టు... వార్మప్ మ్యాచ్ లకు ఇండియా-ఏ జట్టు ఇదే!
- జనవరి 25 నుంచి టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్
- జనవరి 12 నుంచి రెండ్రోజుల వార్మప్ మ్యాచ్
- జనవరి 17 నుంచి నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్
- ఇండియా-ఏ జట్టుతో ఇంగ్లండ్ ప్రాక్టీస్
టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటనకు వస్తోంది. జనవరి 25 నుంచి టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుంది. ఈ టెస్టు సమరానికి ముందు ఇంగ్లండ్ జట్టు భారత్ లో రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ వార్మప్ మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ తో ఆడే ఇండియా-ఏ జట్టును బీసీసీఐ నేడు ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్ కు కూడా ఈ జట్టులో స్థానం లభించింది.
ఇంగ్లండ్ జట్టు కోసం ఈ నెల 12 నుంచి రెండ్రోజుల పాటు తొలి వార్మప్ గేమ్, ఈ నెల 17 నుంచి నాలుగు రోజుల పాటు మరో వార్మప్ గేమ్ నిర్వహించనున్నారు. మొదటి వార్మప్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం గ్రౌండ్ బి వేదికగా నిలవనుండగా, రెండో మ్యాచ్ కు నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, పులకిత్ నారంగ్, నవదీప్ సైనీ, తుషార్ దేశ్ పాండే, విద్వత్ కావేరప్ప, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్.
రెండో టెస్టు: ఫిబ్రవరి 2-6 (విశాఖపట్నం)
మూడో టెస్టు: ఫిబ్రవరి 15-19 (రాజ్ కోట్)
నాలుగో టెస్టు: ఫిబ్రవరి 23-27 (రాంచీ)
ఐదో టెస్టు: మార్చి 7-11 (ధర్మశాల)