Kapil Dev: కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ విడుదల చేసిన 'లాల్ సలామ్' యూనిట్

Lal Salaam wishes Kapil Dev on his birthday with a beautiful poster
  • రజనీకాంత్ ముఖ్యపాత్రలో లాల్ సలామ్
  • ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చిత్రం
  • అతిథిపాత్రలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్
తలైవా రజనీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తున్న లాల్ సలామ్ చిత్రంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అతిథిపాత్రలో కనిపించనున్నారు. ఇవాళ (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా లాల్ సలామ్ చిత్రబృందం ఆసక్తికర పోస్టర్ విడుదల చేసింది. ముంబయి శివాజీ పార్క్ మైదానంలో రజనీకాంత్, కపిల్ దేవ్ నడుస్తూ మాట్లాడుకుంటుండడం ఆ పోస్టర్ లో చూడొచ్చు. 

"లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కు లాల్ సలామ్ టీమ్ హ్యాపీ బర్త్ డే చెబుతోంది. మీరు సాధించిన విజయాలు, మీ నాయకత్వం, మీ ప్రస్థానం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ ఏడాది మీకు ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో సాగిపోవాలని కోరుకుంటున్నాం" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. 

భారీ ఎత్తున రూపుదిద్దుకుంటున్న లాల్ సలామ్ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విష్ణువిశాల్, విక్రాంత్, సెంథిల్, జీవితా రాజశేఖర్, తంబి రామయ్య, అనంతిక సనిల్ కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై తదితరులు నటిస్తున్నారు.
Kapil Dev
Birthday
Lal Salaam
Rajinikanth
Aishwarya Rajinikanth
Lyca Productions

More Telugu News