Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిగా ఐదోసారి పగ్గాలు చేబట్టనున్న షేక్ హసీనా

Sheikh Hasina was elected as the Prime Minister of Bangladesh for the fifth time

  • ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అవామీ లీగ్ పార్టీ
  • ‘గోపాల్‌గంజ్-3’ నియోజకవర్గం నుంచి ఎనిమిదవసారి గెలిచిన షేక్ హసీనా
  • ప్రకటించిన బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం

బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోసారి పీఠం ఎక్కనున్నారు. రికార్డు స్థాయిలో వరుసగా ఐదవసారి ఆమె అధికారాన్ని చేబట్టనున్నారు. ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఎన్నికలను బహిష్కరించడంతో అవామీ లీగ్ పార్టీ గెలుపు సునాయాసంగా గెలిచింది. 

ఇక దేశవ్యాప్తంగా ఆదివారం ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం కౌంటింగ్ మొదలైంది. అన్ని స్థానాల్లో కౌంటింగ్ ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ అవామీ లీగ్ పార్టీ గెలుపు లాంఛనమైంది. ఆ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తున్నారు. కాగా ‘గోపాల్‌గంజ్-3’ నియోజకవర్గం నుంచి ప్రధాని షేక్ హసినా ఎనిమిదవసారి విజయం సాధించారు. 1986 నుంచి ఆమె ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో హసీనాకు 249,965 ఓట్లు పడగా తన సమీప అభ్యర్థి, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాం ఉద్దీన్ లష్కర్‌కి కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి.

  • Loading...

More Telugu News