YSRCP: పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు
- ఎన్నికల వేళ వైసీపీని వీడుతున్న పలువురు నేతలు
- టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
- టీడీపీ, జనసేనలో చేరిన చెరొక ఎమ్మెల్సీ
ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ లపై వేటు వేయాలని మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. వైసీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా... ఎమ్మెల్సీలలో రామచంద్రయ్య టీడీపీలో చేరగా.. వంశీ జనసేనలో చేరారు.