Formula E Race: కార్ రేస్ కు నిధుల విడుదల.. ఐఏఎస్ అధికారి అర్వింద్ కు మెమో

IAS Arvind Kumar Gets Govt Notices Regarding Formula E Race
  • ఫార్ములా - ఈ తో ఒప్పందంపై పలు ప్రశ్నలు
  • కేబినెట్ అనుమతి లేకుండానే రూ.50 కోట్లు విడుదల
  • నిధుల విడుదలపై హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ పై ఆరోపణలు
ఫార్ములా - ఈ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ కు మెమో జారీ చేసింది. కార్ రేసింగ్ కు సంబంధించి ఫార్ములా - ఈ తో కుదుర్చుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని కోరింది. కంపెనీతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని కోరింది. అదేవిధంగా, కేబినెట్ ఆమోదం లేకుండానే రూ.54 కోట్ల నిధులు విడుదల చేయడాన్నీ ఇందులో ప్రశ్నించింది. బీహార్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గత ప్రభుత్వంలో మున్సిపల్ , హెచ్ఎండీఏ కమిషనర్ గా పనిచేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరుపొందారు.

తాజాగా ఆయనకు ప్రభుత్వం మెమో జారీ చేయడం సంచలనంగా మారింది. కాగా, ఫార్ములా రేస్ రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు నోటీసులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ఫార్ములా - ఈ కంపెనీ ప్రశ్నించింది. మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు పంపుతామని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది. దీంతో ఫార్ములా - ఈ కంపెనీతో కుదిరిన ఒప్పందం, నిధులు విడుదల సహా పలు అక్రమాల వివరాలు బయటపడ్డాయి.
Formula E Race
HMDA
ARvind kumar
Car Racing
Funds Release

More Telugu News