YS Sharmila: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి తనయుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల

YS Sharmila invites Telangana Governor Tamilisai to her son marriage
  • ఈ నెల 18న నిశ్చితార్థం.. ఫిబ్రవరి 17న రాజారెడ్డి వివాహం
  • రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్‌కు పత్రికను అందించిన షర్మిల
  • కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తమిళిసై-షర్మిల
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఈ నెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పలువురు ప్రముఖుల వద్దకు స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికను అందిస్తున్నారు.

ఇటీవల ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు పత్రికను అందించారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాజ్ భవన్‌లో కలిసి కొడుకు పెళ్లి పత్రికను అందించి... ఆహ్వానించారు. తన కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలని కోరారు. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.
YS Sharmila
Telangana
Tamilisai Soundararajan

More Telugu News