Mallikarjun Kharge: మాల్దీవుల వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు

Mallikarjun Kharge take a dig at PM Modi

  • లక్షద్వీప్-మాల్దీవుల అంశంపై మోదీకి విశేష రీతిలో మద్దతు
  • ప్రధాని వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న ఖర్గే
  • 2014 నుంచి మోదీ తీరు ఇలాగే ఉందని విమర్శలు
  • పొరుగుదేశాలతో సఖ్యత అవసరమని హితవు

లక్షద్వీప్-మాల్దీవుల వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా, ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని ప్రతి అంశంలోనూ పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీది ఇదే వరస... వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడమే ఆయన అజెండా అని పేర్కొన్నారు. 

భారత్ కు ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత అవసరం అని ఖర్గే స్పష్టం చేశారు. కాలానుగుణంగా మనం మారాలే తప్ప, మనకు నచ్చలేదని పొరుగు దేశాలను మార్చుకోలేం కదా? అని హితవు పలికారు. నాడు బంగ్లాదేశ్ విమోచన నేపథ్యంలో పరిస్థితులు ఎంతో దిగజారిన మీదటే భారత్ పొరుగున ఉన్న పాకిస్థాన్ తో పోరాడిందని ఖర్గే వివరించారు.

  • Loading...

More Telugu News