Team India: రెండో టీ20లో టీమిండియా టార్గెట్ 173 రన్స్

Afghan set Team India 173 runs target

  • ఇందోర్ లో టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 172 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
  • అర్షదీప్ కు 3 వికెట్లు
  • అర్ధసెంచరీ సాధించిన గుల్బదిన్ నాయబ్

టీమిండియాతో  రెండో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందోర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ, ఆఫ్ఘన్ జట్టులోని బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. 

వన్ డౌన్ బ్యాట్స్ మన్ గుల్బదిన్ నాయబ్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేశాడు. నజీబుల్లా జాద్రాన్ 23, కరీమ్ జనత్ 20, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 21 పరుగులు చేశారు. 

లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఫ్ఘన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ ఓవర్లో నూర్ అహ్మద్ (1) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫరూఖీ (0) రనౌట్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ 2, శివం దూబే 1 వికెట్ తీశారు.

రోహిత్ శర్మ ఖాతాలో మరో ఘనత

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో ఘనత చేరింది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ తో రెండో టీ20 మ్యాచ్ రోహిత్ శర్మకు 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 మ్యాచ్ ల మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి క్రికెటర్ రోహిత్ శర్మే. 

  • Loading...

More Telugu News