Asaduddin Owaisi: జమిలి ఎన్నికలపై కమిటీకి లేఖ రాసిన అసదుద్దీన్ ఒవైసీ
- జమిలి ఎన్నికల ప్రతిపాదనలను వ్యతిరేకించిన మజ్లిస్
- జమిలి ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి విపత్తు అని పేర్కొన్న అసదుద్దీన్
- కోవింద్ నేతృత్వంలోని కమిటీకి లేఖను పంపించిన అసదుద్దీన్
మజ్లిస్ పార్టీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ జమిలి ఎన్నికలపై వేసిన ఉన్నతస్థాయి కమిటీకి లేఖ రాశారు. జమిలి ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇవి భారత ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విపత్తు కలిగిస్తాయని అసదుద్దీన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
దేశంలో తరచుగా ఎన్నికలను నివారించటం, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని తగ్గించటమే జమిలి ఉద్దేశం. మన దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీకి అసదుద్దీన్ తమ పార్టీ అభిప్రాయాన్ని పంపించారు.