BCCI: అయోధ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి విరాట్ కోహ్లీ.. పర్మిషన్ ఇచ్చిన బీసీసీఐ!

BCCI has given permission to Virat Kohli to attend Ayodhya Pran Pratishta event

  • కోహ్లీ అభ్యర్థన మేరకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని పేర్కొన్న ‘క్రిక్‌బజ్’ రిపోర్ట్
  • 21న ప్రాక్టీస్ సెషన్ నుంచి బయలుదేరి అయోధ్య వెళ్లనున్న కింగ్
  • సచిన్, ధోనీలతో పాటు అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన స్టార్ బ్యాటర్

ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా జరగనున్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హాజరవ్వడం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు విరాట్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకొని అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న ప్రాక్టీస్ సెషన్ అనంతరం కోహ్లీ టీమిండియా శిబిరం నుంచి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య చేరుకోనున్నాడని ‘క్రిక్‌బజ్’ రిపోర్ట్ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని తెలిపింది. కాగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన క్రికెటర్లలో కోహ్లీతోపాటు మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ‌తోపాటు పలువురు దిగ్గజాలు ఉన్నారు.

కాగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు (బుధవారం) జరగనున్న చివరి మ్యాచ్‌తో ముగిసిపోనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకి, సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది. అనంతరం ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌‌కు సన్నాహకాలు మొదలుకానున్నాయి. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ చేరుకొని టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తుండడంతో కోహ్లీ ఒక రోజు ప్రాక్టీస్ సెషన్‌కు దూరం కానున్నాడు. మరోవైపు తొలి టెస్టు ఆరంభానికి మూడు రోజుల ముందు ఇంగ్లండ్‌ టీమ్ భారత్‌కు చేరుకోనుంది.

  • Loading...

More Telugu News