Rohit Sharma: రిటైర్డ్‌హర్ట్ తర్వాత కూడా రెండో సూపర్ ఓవర్‌లో రోహిత్‌శర్మను ఎలా అనుమతించారు?
- ఆఫ్ఘనిస్థాన్‌పై రెండో సూపర్ ఓవర్‌లో గెలిచిన భారత్
- మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
- రోహిత్ నిర్ణయం సరైందేనంటున్న క్రికెట్ లా
భారత్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో గతరాత్రి జరిగిన మూడో టీ20 ప్రేక్షకులకు భలే మజా పంచింది. మ్యాచ్ రెండుసార్లు టై కాగా, మూడోసారి విజయం రోహిత్ సేనను వరించింది. అయితే, ఈ గేమ్‌లో తొలి సూపర్ ఓవర్‌లో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ రోహిత్‌శర్మ.. రెండో సూపర్ ఓవర్‌లో మళ్లీ ఓపెనర్‌గా ఎలా వచ్చాడన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.
ఇదే విషయాన్ని అంపైర్ల వద్ద ఆఫ్ఘనిస్థాన్ లేవనెత్తింది. ఓవర్ క్రితం రిటైర్డ్‌హర్ట్ అయిన బ్యాటర్‌ను తర్వాతి ఓవర్‌లోనే మళ్లీ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. అయితే, ఈ విషయంలో రోహిత్ నిర్ణయం సరైనదే. ఎందుకంటే అతడు తొలి ఓవర్‌లో అవుట్ కాలేదు. రిటైర్డ్‌హర్ట్‌గా మాత్రమే వెనుదిరిగాడు. కాబట్టి అతడు మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అర్హుడేనని క్రికెట్ లా చెబుతోంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ వీరవిజృంభణ చేశాడు. అజేయంగా 121 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కాగా, ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.