Ramanaidu Studio: రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం.. స్టే విధించిన సుప్రీంకోర్టు
- 2003లో విశాఖలో రామానాయుడు స్టూడియోకు 35 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
- లేఔట్ గా మార్చి అమ్ముకునేందుకు స్టూడియో అధినేతను అనుమతించిన వైసీపీ ప్రభుత్వం
- సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూములను లేఔట్ గా మార్చి అమ్మడంపై స్టే విధించింది. 2003 సెప్టెంబర్ 13న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలు మినహా ఇతర కార్యకలాపాలకు ఆ భూములు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై మార్చి 11లోపు స్పందించాలని ఆదేశించింది.
వాస్తవానికి స్టూడియోకు ఇచ్చిన స్థలంలో లేఔట్ వేసి ఇళ్లను నిర్మించడం చట్ట విరుద్ధం. అయితే దీనికి జిల్లా కలెక్టర్ కూడా ఎన్ఓసీ ఇవ్వడం గమనార్హం. దగ్గుబాటి సురేశ్ బాబు పేరు మీదనే లేఔట్ వేశారు.