Dr Ambedkar Statue: విజయవాడలో నేడు కొలువుదీరనున్న దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం విశేషాలివే!

Dr BR Ambedkar Statue which has to unveil today has lots of specalities

  • విగ్రహం ఎత్తు 125 అడుగులు.. పీఠం ఎత్తు 85 అడుగులు
  • మొత్తం 18 ఎకరాల్లో నిర్మాణం
  • రూ.170 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు వ్యయం పూర్తయ్యే నాటికి రూ.404.35 కోట్లకు చేరిక
  • పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌

విజయవాడలోని పీడబ్ల్యూడీ  మైదానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిజానికి విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, విగ్రహం కోసం నిర్మించిన పీఠం ఎత్తు 85 అడుగులు.. మొత్తంగా చూసుకుంటే 210 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం దేశంలో అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంగా రికార్డులకెక్కనుంది.

మొత్తం 18 ఎకరాల్లో వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ స్మృతివనం ప్రాజెక్టును హైదరాబాద్‌కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది. 2021 డిసెంబర్ 21న మొదలైన ఈ ప్రాజక్టు నిర్మాణం రెండేళ్ల పాటు సాగింది. రూ. 170 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం పూర్తయ్యే సరికి రూ. 404.35 కోట్లకు చేరుకుంది. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ్లలో నడకకు వీలుగా వాకింగ్ ట్రాక్‌లు నిర్మించారు. ఇకపై ఈ ప్రాంతాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా వ్యవహరిస్తారు. 

కన్వెన్షన్ సెంటర్, ఫుడ్‌కోర్ట్
  • ఈ స్మృతివనంలో అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2 వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. అలాగే, ఫుడ్‌కోర్టు, పిల్లల కోసం ఆటస్థలం, మ్యూజికల్ ఫౌంటేన్, నీటి కొలన్లు ఉన్నాయి.  
  • విగ్రహం తయారీలో 400 టన్నుల స్టీల్, 120 టన్నుల కాంస్యం ఉపయోగించారు.
  • విగ్రహ పీఠాన్ని బౌద్ధ వాస్తుశిల్పం కాలచక్ర మహామండలంగా తీర్చిదిద్దారు. 
  • విగ్రహ బరువును తట్టుకునేందుకు భవనం పునాదులను పైల్ ఫౌండేషన్‌తో 30 మీటర్ల పైల్స్‌తో నిర్మించారు. 
  • విగ్రహపీఠం ఉన్న పెడెస్టల్ భవనం మొత్తాన్ని రాజస్థాన్ పింక్ ఇసుకరాయితో తాపడం చేశారు. 
  • 95 ఫోర్ వీలర్లు, 84 ద్విచక్ర వాహనాలు ఒకేసారి నిలుపుకునేలా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. 
  • ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 600 మంది కార్మికులు నిరంతరం పనిచేశారు. 

  • Loading...

More Telugu News