Mohammed Shami: మహ్మద్ షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా?.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్ ఇదే!

Mohammed Shamis New Look Has Internet Curious
  • తలపాగా, మెడలో దండతో పెళ్లికొడుకులా కనిపించిన షమీ
  • ఫొటోలు షేర్ చేసిన టీమిండియా స్టార్ పేసర్
  • అప్పుడే శుభాకాంక్షలు చెప్పేస్తున్న అభిమానులు
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెండో పెళ్లికి రెడీ అయ్యాడా? ఇన్‌స్టాగ్రామ్‌లో షమీ పోస్టు చేసిన ఫొటోలు చేస్తే అవుననే అనిపిస్తోంది. పెళ్లికొడుకు ముస్తాబులో, తలపాగా ధరించి మెడలో దండతో ఉన్న మూడు ఫొటోలను షమీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే అవి వైరల్ అయ్యాయి. ఈ లుక్ ఏంటని కొందరు ప్రశ్నిస్తే, పెళ్లి చేసుకుంటున్నారా సర్? అని మరికొందరు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. 

షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన భార్య హసీన్ జహాన్ కోర్టుకెక్కడం ఇటీవల సంచలనమైంది. షమీ తనతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని, గృహహింస సహా పలు ఆరోపణలు చేస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో షమీ ఇలా దర్శనమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతమంది అభిమానులైతే షమీకి అప్పుడే విషెస్ చెప్పేస్తున్నారు.

మోకాలి గాయంతో బాధపడుతున్న షమీ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గతేడాది నవంబరులో ముగిసిన ప్రపంచకప్ తర్వాతి నుంచి షమీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమైన షమీ, సౌతాఫ్రికా టూర్‌ నుంచి కూడా దూరంగా ఉన్నాడు. ఈ నెల 25 నుంచి ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదు.
Mohammed Shami
Shami Shaadi
Team India
Hasin Jahan

More Telugu News