Ram Setu: రామ సేతు తీరంలో ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!

PM Modi Visits Ram Setus Origin Point In Tamil Nadu Ahead Of  Pran Pratishtha In Ayodhya
  • ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్ సందర్శన
  • అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధాని తీర్థయాత్రలు
  • దక్షిణ భారత దేశంలోని పుణ్య క్షేత్రాలలో మోదీ పూజలు
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామాయణంతో సంబంధం ఉన్న పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో పర్యటిస్తున్న ప్రధాని.. ఆదివారం ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్ ను సందర్శించారు. రామ సేతు తీరంలో ప్రాణాయామంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి కోదండ రాముడిని దర్శించుకున్నారు. వానరసేనతో కలిసి శ్రీరాముడు లంకను చేరేందుకు ధనుష్కోడి తీరానికి వచ్చినట్లు, సముద్రం దాటేందుకు రాళ్లతో వంతెన నిర్మించినట్లు రామాయణ గాథలో వివరించిన విషయం తెలిసిందే. రామ సేతుగా వ్యవహరించే ఈ వంతెన ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో కనిపిస్తాయి.

అంతకుముందు ప్రధాని మోదీ శనివారం శ్రీరంగంలోని రంగనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై రామేశ్వరం వెళ్లిన ప్రధాని అక్కడి ఆలయంలోని పవిత్ర తీర్థాల్లో పుణ్య స్నానం ఆచరించారు. ప్రతీ తీర్థం దగ్గర ప్రధాని పుణ్య స్నానం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడే సాగర స్నానం చేసిన మోదీ.. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్పే రామేశ్వర లింగానికి పూజలు చేశారు.


Ram Setu
PM Modi
Dhanushkodi
Modi Visit
Tamilnadu
Rameswaram
SriRangam
Arichal Munai Point

More Telugu News