Ayyappa Temple: శబరిమల అయ్యప్ప ఆలయం నేటి నుంచి మూసివేత
- గతేడాది నవంబరు 17న తెరుచుకున్న అయ్యప్ప ఆలయం
- ముగిసిన 41 రోజుల మండల పూజలు
- ఈ సీజన్ లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 50 లక్షలు
- స్వామివారి ఆదాయం రూ.357 కోట్లు
కేరళలోని శబరిమలలో కొలువైన సుప్రసిద్ధ అయ్యప్పస్వామి పుణ్యక్షేత్రం నేటి నుంచి మూసివేయనున్నారు. అయ్యప్ప ఆలయాన్ని 41 రోజుల మండల పూజల కోసం గతేడాది నవంబరు 23న తెరిచారు.
ఈ సీజన్ లో అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సీజన్ లో శబరిమల ఆలయాన్ని 50,06,412 మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాది 44 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.357.47 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది ఇదే మండలం-మకరవిళక్కు సీజన్ లో స్వామివారికి రూ.347.12 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ సీజన్ లో స్వామివారి అరవణ ప్రసాదం (బెల్లం పాకంతో కూడిన ఎర్రబియ్యం)విక్రయాలతో రూ.144.99 కోట్లు, అప్పం (బియ్యంతో తయారు చేసే తీపి వడలు) అమ్మకాలతో రూ.17.77 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది.