Chiranjeevi: చిరంజీవిని అసెంబ్లీలో చూడాలని ఉంది.. కాపులంతా కాంగ్రెస్ లోకి రావాలి: చింతా మోహన్
- తిరుపతి నుంచి పోటీ చేయాలని చిరంజీవిని కోరిన చింతా మోహన్
- రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల నియామకం మంచి నిర్ణయమని వ్యాఖ్య
- కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం
ఏపీలో అప్పుడే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రంలో కోల్పోయిన పట్టును మళ్లీ పొందాలనే పట్టుదలతో ఉంది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ స్పందిస్తూ... కాపులందరూ కాంగ్రెస్ లో చేరాలని, అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చిరంజీవిని అసెంబ్లీలో చూడాలని ఉందని చెప్పారు. తిరుపతి నుంచి పోటీ చేయాలని చిరంజీవిని కోరుతున్నామని అన్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడం పార్టీ హైకమాండ్ తీసుకున్న మంచి నిర్ణయమని చెప్పారు. పార్టీ నాయకత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.