Ram Lalla: అయోధ్య బాలరాముడికి అత్యధిక విరాళం సమర్పించింది ఎవరో తెలుసా...?
- అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నాడు సుప్రీంకోర్టు అనుమతి
- రామ్ లల్లా కోసం వెల్లువెత్తిన విరాళాలు
- 101 కేజీల బంగారం అందజేసిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్
- ఆ బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.68 కోట్లు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నాడు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, ఆలయ నిర్మాణం కోసం విరాళాలు వెల్లువెత్తాయి. అత్యధిక మొత్తంలో విరాళాలు ఇచ్చినవారిలో సూరత్ కు చెందిన దిలీప్ కుమార్ లాఖీ అగ్రస్థానంలో నిలుస్తారు. దిలీప్ కుమార్ ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆయనొక్కరే అయోధ్య ఆలయ నిర్మాణం కోసం 101 కిలోల బంగారం విరాళంగా ఇవ్వడం విశేషం. మార్కెట్ విలువ ప్రకారం ఈ బంగారం విలువ రూ.68 కోట్లు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల్లో అదే అత్యధికం! దిలీప్ కుమార్ అందించిన బంగారాన్ని బాల రాముని మందిరంలో గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, ఢమరు, త్రిశూలం వంటి నిర్మాణాల్లో ఉపయోగించారు.