PM Rashtriya Bala Puraskar: కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలికకు పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం
- రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్న 14 ఏళ్ల పెండ్యాల లక్ష్మీ
- కూచిపూడి నృత్యంలో ప్రతిభను గుర్తించి అవార్డు అందజేత
- 9 మంది బాలురు, 9 మంది బాలికలకు పురస్కారాల ప్రదానం
తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియకు (14) ‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం’ దక్కింది. కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరుస్తున్నందున ఆమెకు ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా లక్ష్మీ ప్రియ బాల పురస్కారాన్ని స్వీకరించింది. ఆమెతో పాటు మరో 9 మంది బాలికలు, 9 మంది బాలురకు ఈ పురస్కారాలు లభించాయి. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వీరంతా అవార్డులు పొందారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలైన బాల, బాలికలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించి మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు పోటీతత్వాన్ని మెరుగుపరచుకోవచ్చని సూచించారు.