Mavrick 440: హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త బైక్... మావెరిక్ 440
- ప్రీమియం సెగ్మెంట్లో ఆకట్టుకునే బైక్ తీసుకువస్తున్న హీరో
- 440 సీసీ ఇంజిన్... 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్
- స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్... ఫుల్లీ డిజిటల్ కన్సోల్
- కుర్రకారు మెచ్చేలా అనేక ఫీచర్లతో... హీరో మావెరిక్ 440
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ ను తీసుకువస్తోంది. దీనిపేరు మావెరిక్ 440. డిజైన్ దృష్ట్యా ఇది ప్రీమియం సెగ్మెంట్ బైక్ అని తెలుస్తోంది. యువతరం మెచ్చేలా దీన్ని రూపొందించారు.
హై టెన్సిల్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ పై బాడీ నిర్మించిన ఈ బైక్ 440సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో ఫుల్ వెర్టికల్, ఎయిర్ కూల్డ్ 2వీ ఇంజిన్ ను వినియోగించారు. ఈ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 27 బీహెచ్ పీ శక్తి వద్ద 6000 ఆర్పీఎమ్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో హెడ్ ల్యాంప్, పొజిషన్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్ కోసం ఎల్ఈడీలను వినియోగించారు. ఈ బైక్ అల్లాయ్ వీల్స్ తో 187 కేజీలు, స్పోక్ వీల్స్ తో అయితే 191 కేజీల బరువుంటుంది. షాక్ ఎబ్జార్వర్ల విషయానికొస్తే... టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్, హైడ్రాలిక్ రియర్ ట్విన్ షాక్స్ స్వింగ్ ఆర్మ్ మౌంట్ సస్పెన్షన్ పొందుపరిచారు.
6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ (స్లిప్పర్ క్లచ్), డిజిటల్ కన్సోల్, స్మార్ట్ ఫోన్ అనుసంధానత, క్లియర్ ఇండికేటర్, ఆకట్టుకునే డిజైన్ తో ఫ్యూయల్ ట్యాంక్, వై షేప్ సైడ్ కవర్, అత్యధిక భాగం మెటల్ వినియోగం, సిగ్నేచర్ హెచ్ షేప్ రౌండ్ హెడ్ ల్యాంప్, హీరో మావెరిక్ విశిష్టతలు.
హీరో మోటోకార్ప్ ఈ బైక్ లో బేస్, మిడ్, టాప్ వేరియంట్లు తీసుకువస్తోంది. బేస్ వేరియంట్ లో ఆర్కిటిక్ వైట్... మిడ్ వేరియంట్ లో ఫియర్లెస్ రెడ్, సెలెస్టియల్ బ్లూ... టాప్ వేరియంట్ లో ఫాంటమ్ బ్లాక్, ఎనిగ్మా బ్లాక్ రంగుల్లో ఈ బైక్ లభ్యం కానుంది.
ఈ బైక్ లో 36కి పైగా ఇతర ఫీచర్లు ఉన్నాయి. ధర వివరాలు మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ హీరో మావెరిక్ 440 బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.