Dhulipala Narendra Kumar: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది: ధూళిపాళ్ల నరేంద్ర
- నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చుతున్న వైసీపీ నాయకత్వం
- వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తుల సంఖ్య
- గణాంకాలతో సహా వివరించిన టీడీపీ నేత ధూళిపాళ్ల
వైసీపీలో రాజకీయ బదిలీలను ప్రస్తావిస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ రెడ్డి నిన్నటి వరకు గొప్పలు... నేడు తిప్పలు అంటూ వివిధ గణాంకాలతో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని స్పష్టం చేశారు.
"నన్ను మించిన సంక్షేమ ప్రభుత్వం లేదు... 175 గెలుస్తా అని జగన్ నిన్నటి వరకు గొప్పలు చెప్పారు. వాస్తవం ఏంటంటే... జగన్ కు తన పాలనపైనే నమ్మకం లేదు. తన ఎమ్మెల్యేల పనితీరునూ నమ్మడం లేదు. జనం జగన్ ను నమ్మడం లేదు. జగన్ ఎమ్మెల్యేలను నమ్మడం లేదు. అందుకే 68 మంది బదిలీలు చోటుచేసుకున్నాయి.
68 రాజకీయ బదిలీల్లో సీట్లు కోల్పోయిన వారు 29 మంది...
సీట్లు ఎగ్గొట్టిన వారిలో దళితులు 11 మంది...
సీట్లు పీకేసిన వారిలో బీసీలు నలుగురు...
సైకోతో వేగలేం అంటూ రాజీనామా చేసిన ఎంపీలు నలుగురు (రఘురామ రాజు, బాలశౌరి, సంజీవ్ కుమార్, శ్రీ కృష్ణ దేవరాయలు)....
మాకొద్దీ తుగ్లక్ అంటూ పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ఆరుగురు (ఆనం, కోటం రెడ్డి, మేకపాటి, ఆళ్ల, ఉండవల్లి శ్రీదేవి, పార్థ సారథి)...
రివర్స్ సీఎంతో కష్టం అంటూ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీలు ఇద్దరు (విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్, కడప ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య)...
వైసీపీలో దళితుల ఆత్మగౌరవంపై నిజాలు చెప్పిన ఎస్సీ ఎమ్మెల్యేలు నలుగురు (పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నంది కొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి)...
ఇప్పుడు చెప్పండి... జగన్ కు తన ప్రభుత్వంపై నమ్మకం ఉందా?
ఇప్పుడు చెప్పండి... వైసీపీలో దళితులకు గౌరవం ఉందా?
ఇప్పుడు చెప్పండి... బీసీలకు వైసీపీలో విలువ ఉందా?
ఇప్పుడు చెప్పండి... జగన్ కు అసలు తనపై తనకు నమ్మకం ఉందా?
Why not 175 నుంచి we are going to out అనే పరిస్థితికి వైసీపీ దిగజారింది.
సైకో పోవడం ఖాయం....టీడీపీ-జనసేన ప్రభుత్వం తథ్యం!" అంటూ ధూళిపాళ్ల తన ట్వీట్ లో పేర్కొన్నారు.