Cheetah: కునో నేషనల్ పార్క్ లో మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

Namibia Cheetah Jwala gives birth to three cubs on Kuno National Park

  • భారత్ లో చీతాల సంతతి వృద్ధికి కేంద్రం చర్యలు
  • నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాల దిగుమతి
  • అనారోగ్య కారణాలతో 10 చీతాల మృతి
  • తాజాగా 3 పిల్లలు పెట్టిన 'జ్వాల'

భారత్ లో చీతాల సంతతిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు విదేశాల నుంచి తెచ్చిన ఆ చీతాల్లో 10 మరణించాయి. అనారోగ్య కారణాలతో అవి మృత్యువాత పడినట్టు తెలిసింది. 

అయితే, నమీబియా నుంచి తెచ్చిన 'జ్వాల' అనే చీతా తాజాగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవలే 'అసాహా' అనే చీతా కొన్ని పిల్లలు పెట్టగా, ఇప్పుడు 'జ్వాల' కూడా మూడు కూనలకు జన్మనివ్వడంతో కునో నేషనల్ పార్క్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందించారు. వన్యప్రాణి సంరక్షకులకు, వన్యప్రాణి ప్రేమికులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత్ వన్యప్రాణి సంతతి వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 'జ్వాల' అనే చీతా, దాని పిల్లల వీడియోను కూడా పంచుకున్నారు.

  • Loading...

More Telugu News