Naresh:  ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: నటుడు నరేశ్

Naresh Interview

  • నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న నరేశ్
  • బాలనటుడిగా చేసిన 'పండంటి కాపురం'
  • తనని హీరోను చేయడానికి తల్లి ఒప్పుకోలేదని వ్యాఖ్య 
  • తాను చేసిన ప్రయోగాలు ఫలించలేదని వెల్లడి    


హాస్య కథానాయకుడిగా సీనియర్ నరేశ్ కొంతకాలం పాటు తన జోరు చూపించారు. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నటుడిగా ఆయన 50 సంవత్సరాలను పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

'పండంటి కాపురం' సినిమాతో నేను బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాను. అది కూడా అమ్మకి తెలియకుండా అప్పటికప్పుడు జరిగిపోయింది. ఇక హీరోను అవుతానని అన్నప్పుడు మాత్రం అమ్మ ఒప్పుకోలేదు. ముందుగా చదువు పూర్తిచేయమని అన్నారు. కానీ నాకు చదువుపై ధ్యాస ఉండేది కాదు. ఆ  సమయంలో అమ్మ అంటే భయం .. సినిమా అంటే ఇష్టం ఉండేది" అన్నారు. 

" హీరోగా ఫస్టు మూవీ 'సీతాకోకచిలుక' చేయవలసింది .. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఆ తరువాత జంధ్యాల గారి చలవ వలన హీరోను అయ్యాను. అప్పటి నుంచి హీరోగానే ముందుకు వెళ్లాను. కాస్త డిఫరెంట్ గా చేయాలని అనుకునేవాడిని. ఒకానొక దశలో నా సినిమాలు వరుసగా దెబ్బతిన్నాయి. ఇక నేను హీరోగా పనికిరానేమో అనే డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయాను" అని చెప్పారు.

  • Loading...

More Telugu News