TTD: దర్శన టికెట్లు పొందిన భక్తులకు ఆన్లైన్లో వసతి గదులు కేటాయించిన టీటీడీ
- తొలిసారి ప్రత్యేకంగా వసతి గదుల కేటాయింపును ఆన్లైన్లో చేపట్టిన టీటీడీ
- 2 గంటల 45 నిమిషాల్లోనే ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు
- ఈ నెల 18 - 24 మధ్య శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్తో పాటు పలు టికెట్ల విక్రయం
బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడీ) టికెట్లు గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయని టీటీడీ ప్రకటించింది. భక్తులు కేవలం 2 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేశారని తెలిపింది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 18 - 24 మధ్య టీటీడీ అందుబాటులో ఉంచింది. కాగా ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తుల కోసం మాత్రమే తొలిసారి వసతి గదుల కేటాయింపును ఆన్లైన్లో నిర్వహించింది. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.