Stock Market: ఐటీ స్టాకుల ఎఫెక్ట్ తో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses

  • 359 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 101 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా నష్టపోయిన టెక్ మహీంద్రా షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 359 పాయింట్లు నష్టపోయి 70,700కి పడిపోయింది. నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 21,352కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (1.84%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.00%), రిలయన్స్ (0.81%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.49) . 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-6.12%), భారతి ఎయిర్ టెల్ (-2.57%), ఐటీసీ (-1.78%), విప్రో (-1.68%), ఏసియన్ పెయింట్ (-1.67%).

  • Loading...

More Telugu News