Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయాన్ని పంపిన చంద్రబాబు
- వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ లపై పిటిషన్
- వారిని అనర్హులుగా ప్రకటించాలన్న టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి
- చంద్రబాబు అభిప్రాయాన్ని కోరిన స్పీకర్ తమ్మినేని సీతారాం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తన అభిప్రాయాన్ని నేడు అసెంబ్లీ స్పీకర్ కు పంపించారు.
టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ శాసనసభ్యుడు, పార్టీ విప్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ లను అనర్హులుగా ప్రకటించాలంటూ తన పిటిషన్ లో కోరారు.
డోలా పిటిషన్ పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విపక్ష నేత చంద్రబాబు అభిప్రాయం కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని వెల్లడించారు. సదరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు చంద్రబాబు బదులిచ్చారు.