Ration Cart KYC: రేషన్‌కార్డుకు కేవైసీ పూర్తిచేశారా?.. మరో మూడు రోజులే గడువు

Ration Card KYC Last Date 31st January

  • బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతలో భాగంగా కేవైసీ ధ్రువీకరణను తీసుకొచ్చిన ప్రభుత్వం
  • ఈ నెల 31తో తీరనున్న గడువు
  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నత్తనడకన కేవైసీ ప్రక్రియ

బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేవైసీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. బోగస్ కార్డులతోపాటు చనిపోయిన వారు, పెళ్లిళ్లు చేసుకొని మరోచోటికి వెళ్లిపోయిన వారి పేరున కూడా రేషన్ పొందుతున్నట్టు వార్తలు రావడంతో ప్రభుత్వం గతేడాది కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను ప్రవేశపెట్టింది. 

రేషన్‌కార్డు లబ్ధిదారులు ప్రతి ఒక్కరు రేషన్ దుకాణాలకు వెళ్లి తమ వేలిముద్రలు ఇచ్చి కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. దీంతో చాలామంది కేవైసీని పూర్తి చేసుకున్నారు. ఈ నెల 31తో ఈ గడువు తీరనుండగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలు మినహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 30 శాతం మంది కేవైసీ పూర్తిచేసుకోలేదని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News