medaram: మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మహా జాతర పోస్టర్ ఆవిష్కరణలో మంత్రులు సీతక్క, సురేఖ, పొన్నం, పొంగులేటి
- మేడారం జాతర పనులను పరిశీలించిన కలెక్టర్ త్రిపాఠి
- అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. సమ్మక్క - సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. రోడ్లు, తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
మేడారం జాతర పనులు పరిశీలించిన కలెక్టర్
ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి శనివారం మేడారం జాతర పనుల పురోగతిని పరిశీలించారు. హరిత హోటల్, దేవాలయ పరిసరాలు, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఊరట్టం రోడ్డు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక పనులు, అప్పటికప్పుడు చేయాల్సిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తోన్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రతిరోజు పనుల పురోగతిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నట్లు తెలిపారు.