Nitish Kumar: బీహార్‌ సీఎంగా 9వ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నితీశ్ కుమార్ తొలి రియాక్షన్ ఇదే

This is Nitish Kumars first reaction after taking oath as Bihar CM for the 9th time

  • ఈసారి తాము కలిసి ఉండబోతున్నామన్న నితీశ్ కుమార్
  • ఎలాంటి పరిస్థితిలో బీజేపీకి దూరమయ్యానో అందరికీ తెలుసంటూ వ్యాఖ్య
  • తిరిగి ఎన్డీయేలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం

బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదవ సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జత కట్టడంపై స్పందిస్తూ... ఈసారి తాము కలిసి ఉండబోతున్నామని అన్నారు. ‘‘ఈ మహాకూటమిలోకి నేను ఏవిధంగా వచ్చానో మీకు తెలుసు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎలా పనిచేశానో మీ అందరికీ అవగాహన ఉంది. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మంచిగా అనిపించలేదు. అవి నా పార్టీలో ఉన్నవారికి కూడా రుచించలేదు’’ అని నితీశ్ అన్నారు. 

‘‘నేను గతంలో కూడా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నాను. వేర్వేరు మార్గాల్లో వెళ్లినప్పటికీ తిరిగి మళ్లీ కలిశాం. ఇకపై కలిసి ఉంటాం. ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మిగిలినవారు త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా నియమితులయ్యారు’’ అని నితీశ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

కాగా నితీశ్ కుమార్ 2022 జులైలో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాకూటమిలో చేరి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బీహార్ బీజేపీలో కీలకంగా ఉన్న సుశీల్ కుమార్ మోదీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో నాడు డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీ స్థానంలో ప్రస్తుతం బీజేపీ నుంచి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు.

  • Loading...

More Telugu News