Krishna Patnam Port: కృష్ణపట్నం పోర్టు తరలిపోతే నెల్లూరు జిల్లాకు మిగిలేది బొగ్గు, బూడిదే: సోమిరెడ్డి
- నేడు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ధర్నా
- మద్దతు పలికిన సోమిరెడ్డి
- కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టు తరలించవద్దని డిమాండ్
- కృష్ణపట్నం పోర్టు ఏపీ సంపద అని వెల్లడి
- పోర్టు తరలిపోతే ఏపీకి ఆర్థికనష్టం తప్పదని వ్యాఖ్యలు
కృష్ణపట్నం నుంచి అదానీ పోర్టును తరలించవద్దంటూ ఇవాళ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు.
కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టు తరలిపోతే ఏపీకి ఆర్థికంగా నష్టం తప్పదని సోమిరెడ్డి అన్నారు. కృష్ణపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్ విలువైన సంపద అని పేర్కొన్నారు. పోర్టు తరలిపోతే నెల్లూరు జిల్లాకు బొగ్గు, బూడిదే మిగులుతుందని వ్యాఖ్యానించారు. త్వరలో అఖిలపక్షం నేతలతో కలిసి కృష్ణపట్నం పోర్టును సందర్శిస్తామని సోమిరెడ్డి వెల్లడించారు. పోర్టు తరలిపోకుండా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.