Champai Soren: ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సొరెన్!

Champai Soren elected as new chief minister of Jharkhand

  • హేమంత్ సొరెన్ పై భూకుంభకోణం ఆరోపణలు
  • మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ
  • సీఎం పదవికి రాజీనామా!

ఝార్ఖండ్ కు కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. ఇప్పటివరకు సీఎంగా వ్యవహరించిన హేమంత్ సొరెన్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటూ, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన రాంచీలోనే ఈడీ విచారణకు హాజరైనట్టు తెలిసింది.

ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రవాణా మంత్రి చంపై సొరెన్ ను జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ కు వెళ్లి నూతన సీఎంను ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు. 

చంపై సొరెన్... జేఎంఎం వ్యవస్థాపక అధినేత శిబు సొరెన్ కుటుంబానికి విధేయుడిగా గుర్తింపు పొందారు.

  • Loading...

More Telugu News