Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మహిళా జర్నలిస్టులు

Women journalists congrats Megastar Chiranjeevi
  • చిరంజీవికి పద్మ విభూషణ్
  • కొనసాగుతున్న అభినందనల పర్వం
  • చిరంజీవి నివాసంలో సందడి చేసిన మహిళా పాత్రికేయులు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో ఆయనపై అభినందనల పరంపర కొనసాగుతోంది. తాజాగా, ఆయనను ప్రముఖ మహిళా జర్నలిస్టులు, యాంకర్లు కలిశారు. ప్రేమమాలిని, అంజలి, మంజులతా కళానిధి తదితరులు చిరంజీవి నివాసానికి వచ్చారు. చిరంజీవికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో స్పెషల్ కేక్ కట్ చేయించి అభినందనల జల్లు కురిపించారు. మహిళా జర్నలిస్టుల రాకతో చిరంజీవి నివాసం సందడిగా మారింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
Chiranjeevi
Women Journalists
Padma Vibhushan
Megastar
Hyderabad
Tollywood

More Telugu News