Mumbai Bomb Threats: వరుస బాంబు పేలుళ్ల బెదిరింపులు.. ముంబైలో హైఅలర్ట్!

Mumbai on alert after serial blasts threat message agencies launch probe

  • పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం పోలీసులకు సందేశాలు
  • అప్రమత్తమైన పోలీసులు, పలు చోట్ల తనిఖీలు
  • బెదిరింపుల వెనక ఎవరున్నారో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం

ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం బెదిరింపులు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు బెదిరింపుల వెనకున్నది ఎవరో తేల్చేందుకు రంగంలోకి దిగారు. నగరంలో ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు పోలీసులకు సందేశాలు అందాయి. 

గత నెల 6న కూడా నిందితులు బెదిరింపు ఈ-మెయిళ్లు పంపించారు. కొలాబా ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రయాల, వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్‌లో బాంబులు అమర్చినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన ముంబై పోలీసులు.. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను ఆయా ప్రాంతాలకు పంపించారు. అయితే, అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ-మెయిల్స్ పంపించిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News