Ponguleti Srinivas Reddy: సోదరుడి కొడుకు పెళ్లికి షర్మిల, జూ.ఎన్టీఆర్‌లను ఆహ్వానించిన మంత్రి పొంగులేటి

Ponguleti invites Sharmila and Junior NTR to his brother marriage
  • పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి పెళ్లికి ఆహ్వానం
  • వారి ఇంటికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన మంత్రి పొంగులేటి
  • నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పత్రిక అందజేసిన మంత్రి
తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. శనివారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌లను కలిసి వారిని లోహిత్ రెడ్డి వివాహానికి ఆహ్వానించారు. వారికి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వారిని కలిసి ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్లుగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను నిన్న రాజ్ భవన్‌లో కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడి తనయుడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు.
Ponguleti Srinivas Reddy
Telangana
Congress
Tamilisai Soundararajan

More Telugu News