CBI: నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్

CBI gave clean chit for AP Minister Kakani Govardhan Reddy In file  Missing case in Nellore court
  • ఫైల్స్ మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని తేల్చి చెప్పిన కేంద్ర దర్యాప్తు సంస్థ
  • సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌ నిందితులని వెల్లడి
  • ఛార్జిషీట్‌లో వివరాలు పేర్కొన్న సీబీఐ అధికారులు
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఉపశమనం దక్కింది. ఆయనకు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా పేర్కొంది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్‌ షీట్‌లో స్పష్టం చేసింది.

సీబీఐ తాజాగా మంత్రి కాకాణికి దోషులతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఇక ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. ఏడాది పాటు విచారణ జరిపిన సీబీఐ అధికారులు 88 మంది సాక్షులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన 403 పేజీల చార్జ్‌షీట్‌ రూపొందించింది. కాగా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆయన మొదటి నుంచి చెబుతూ వచ్చారు. సీబీఐ విచారణకైనా తాను సిద్ధమంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
CBI
Kakani Govardhan Reddy
AP Minister
file Missing case in Nellore court
ap news

More Telugu News