Chiranjeevi: చిరంజీవిని అభినందించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన శివ రాజ్ కుమార్

Shiva Rajkumar came to Hyderabad and congratulated Chiranjeevi
  • చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
  • స్వయంగా విచ్చేసి చిరంజీవికి అభినందనలు తెలిపిన శివన్న
  • కన్నడ స్టార్ హీరోకి తన ఇంట్లో లంచ్ ఏర్పాటు చేసిన చిరంజీవి
  • శివన్న స్వయంగా రావడం తన హృదయానికి హత్తుకుందని వెల్లడి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికీ ఆయనపై అభినందనల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ చిరంజీవిని అభినందించడం కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"నన్ను అభినందించడం కోసం శివన్న బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం నా హృదయానికి హత్తుకుంది. శివన్నకు మా ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అనేక జ్ఞాపకాలను కలబోసుకున్నాం. దివంగత మహా నటుడు రాజ్ కుమార్ తోనూ, ఆయన కుటుంబంతోనూ నాకున్న అనుబంధం గురించి మాట్లాడుకున్నాం. ఈ అద్భుతమైన సమావేశం ఎంతో సంతోషం కలిగించింది" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Padma Vibhushan
Shiva Rajkumar
Hyderabad
Bengaluru

More Telugu News