BBC: రామమందిరంపై బీబీసీ పక్షపాత ధోరణిని ఎండగట్టిన బ్రిటన్ ఎంపీ!

British MP Bob Blackburn calls out BBCs biased coverage of Ayodhya Ram Mandir
  • మసీదు స్థలంలో రామమందిరం ఏర్పాటైందని మాత్రమే ప్రచురించడంపై అభ్యంతరం
  • 2 వేల ఏళ్ల క్రితం అక్కడ రామమందిరం ఉందన్న విషయాన్ని విస్మరించిందని విమర్శ
  • బీబీసీ తీరుపై పార్లమెంటులో చర్చ జరగాలంటూ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ డిమాండ్
రామమందిర ప్రారంభోత్సవంపై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ వివక్షాపూరిత కథనాలు ప్రసారం చేసిందంటూ బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ మండిపడ్డారు. కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ అయిన బ్లాక్‌మన్ పార్లమెంటు వేదికగా బీబీసీ తీరును ఎండగట్టారు. మసీదు కూల్చిన స్థలంలో మందిరాన్ని నిర్మించారని చెప్పిన బీబీసీ.. అక్కడ 2 వేల ఏళ్ల క్రితం దేవాలయం ఉన్న విషయాన్ని మాత్రం విస్మరించిందని విమర్శించారు.  

‘‘ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. రాముడు జన్మించిన ప్రాంతంలో రామాలయం  ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ బీబీసీ మాత్రం వివక్షాపూరిత కథనాలు ప్రచురించింది. అది మసీదు కూల్చిన స్థలం అని పేర్కొంది. అక్కడ 2 వేల ఏళ్ల క్రితమే దేవాలయం ఉన్న విషయాన్ని, ముస్లింల కోసం మరో చోట ఐదు ఎకరాల స్థలం కేటాయించిన విషయాన్ని మాత్రం మర్చిపోయింది’’ అంటూ ఆయన మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై నిష్పక్షపాత కథనాలు అందించడంలో బీబీసీ విఫలమైందన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని కూడా ఆయన కోరారు.
BBC
Ayodhya Ram Mandir
Britain

More Telugu News