GV Harsha Kumar: ఎస్సీలను వైసీపీ నుంచి బయటికి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నా: మాజీ ఎంపీ హర్షకుమార్

GV Harsha Kumar comments on YCP
  • వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తిన జీవీ హర్షకుమార్
  • రాష్ట్రంలో నలుగురు పెత్తందార్లు ఉన్నారని విమర్శలు
  • సజ్జల, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఆ పెత్తందార్లు అని వెల్లడి
  • తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ తరఫునే పోటీ చేస్తానని స్పష్టీకరణ 
వైసీపీ నాయకత్వంపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నలుగురు పెత్తందార్లుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ పెత్తందార్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి అని వివరించారు. వైసీపీ నుంచి ఎస్సీలను బయటికి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నానని హర్షకుమార్ తెలిపారు. ఇక, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

జీవీ హర్షకుమార్ 2004 నుంచి 2014 వరకు అమలాపురం ఎంపీగా కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2020 నుంచి మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు.
GV Harsha Kumar
Congress
Amalapuram
YSRCP
Andhra Pradesh

More Telugu News