Upasana: తాతకు 91వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన

Upasana wishes Apollo Prathap C Reddy on his 91st birthday
  • నేడు అపోలో ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు
  • ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన
  • ప్రతాప్ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన పుస్తకంపై స్పందన 
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నేడు 91వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవరాలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో స్పందించారు. 

"హ్యాపీ బర్త్ డే తాతా" అంటూ ప్రతాప్ సి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, ప్రతాప్ సి రెడ్డి జీవితంపై తీసుకువచ్చిన 'ది అపోలో స్టోరీ' పుస్తకం గురించి కూడా ఉపాసన ప్రస్తావించారు. "ఎల్లలు లేని కలలు కనే ప్రతి ఆడపిల్లకు, మగబిడ్డలతో సమానంగా కూతుళ్లకు మద్దతుగా నిలిచే తండ్రులకు ఈ పుస్తకం ఒక భావోద్వేగ నివాళి. ఈ పుస్తకం తీసుకువరావడంలో సహకరించిన అమర్ చిత్ర కథ సంస్థకు, రానా దగ్గుబాటికి కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు.
Upasana
Prathap C Reddy
Apollo Hospitals
The Apollo Story

More Telugu News