Perni Nani: ఏపీ అసెంబ్లీ లాబీలో పేర్ని నాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ

Interesting discussion between Perni Nani and Gorantla Butchaiah Chowdary
  • అసెంబ్లీ లాబీలో ఎదురు పడిన పేర్ని నాని, గోరంట్ల
  • త్వరలో మనిద్దరం రిటైర్ అవబోతున్నామన్న పేర్ని నాని
  • వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీలో ఉంటానన్న గోరంట్ల
ఏపీ అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ లాబీలో ఇద్దరూ ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా త్వరలో మీరు, నేను రిటైర్ అవబోతున్నామని గోరంట్లతో పేర్ని నాని అన్నారు. దీనిపై బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ... తాను రిటైర్ కావడం లేదని చెప్పారు. దీనికి పేర్ని నాని నవ్వుతూ బదులిస్తూ.... వచ్చే ఎన్నికల్లో మీకు టీడీపీ టికెట్ దక్కదంటున్నారని అన్నారు. తాను 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటానని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇదిలావుంచితే, వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేయబోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Perni Nani
YSRCP
Gorantla Butchaiah Chowdary
Telugudesam
AP Politics

More Telugu News