YSRCP: రాజ్యసభ ఎన్నికలు... వైసీపీ ముగ్గురు అభ్యర్థులు వీరే
- రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి
- ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కూడా అవకాశం
- చివర్లో అవకాశం కోల్పోయిన ఆరని శ్రీనివాసులు
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి పేర్లను ఫైనలైజ్ చేశారు. అభ్యర్థుల పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు జగన్ ను వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి కలిశారు. రాజ్యసభకు తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వీరు ముగ్గురినీ ముఖ్యమంత్రి అభినందించారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన వారిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా... ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. తొలుత మూడో స్థానం కోసం ఆరని శ్రీనివాసులు పేరును జగన్ ఎంపిక చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన స్థానంలో మేడా రఘునాథరెడ్డి పేరును చేర్చడం జరిగింది.
ఈరోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది.