Lal Salaam: "దిక్కు దిక్కునీ కట్టిపడేసే... వేగం వీడి సొంతం"... రజనీకాంత్ 'లాల్ సలామ్' నుంచి హుషారైన గీతం విడుదల

Jalali song out now from Rajinikanth starred Lal Salaam
  • రజనీకాంత్ ముఖ్యపాత్రలో లాల్ సలామ్
  • రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో చిత్రం
  • ఫిబ్రవరి 9న గ్రాండ్ రిలీజ్
  • ఏఆర్ రెహమాన్ సంగీతం
రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం లాల్ సలామ్. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా, ఈ చిత్రం నుంచి ఓ హుషారైన గీతాన్ని విడుదల చేశారు. 

జలాలీ... దిక్కు దిక్కునీ కట్టిపడేసే సత్తువ వీడికున్న వేగం... అంటూ ఈ పాట సాగుతుంది. ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు. రాకేందు మౌళి, మషూక్ రెహమాన్, ఏఆర్ రెహమాన్ సాహిత్యం సమకూర్చారు. అరబిక్, సూఫీ సంగీత సంప్రదాయానికి ర్యాప్ ను మిక్స్ చేసి ఈ పాట రూపొందించినట్టు తెలుస్తోంది. 

లాల్ సలామ్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుభాస్కర్ నిర్మించారు. ఇందులో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించారు. విష్ణువిశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత రాజశేఖర్, తంబి రామయ్య, అనంతిక సనిల్ కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై తదితరులు నటించారు. 
Lal Salaam
Jalali
Rajinikanth
Aishwarya Rajinikanth
Lyca Productions
Kollywood
Tollywood

More Telugu News