Microsoft: విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్

Microsoft issued a key alert for Windows 11 users

  • విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకనున్నట్టు అధికారికంగా ప్రకటన
  • డిసెంబర్ 31, 2024తో సేవలు ఆగిపోనున్నట్టు వెల్లడి
  • కొత్తగా తీసుకొచ్చిన ‘మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్’ యాప్‌‌‌‌ వినియోగానికి యూజర్లను ప్రోత్సహించేందుకు నిర్ణయం

విండోస్11 యూజర్లకు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని వెల్లడించింది. యూజర్లు ‘మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్’ యాప్‌‌ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో ఈ మార్పు భాగంగా ఉందని, ‘ఆఫీస్ 365’ టూల్స్‌లో భాగంగా ‘ఔట్ లుక్’ యాప్‌ సర్వీసును అందించనున్నట్టు తెలిపింది.

దీంతో రోజువారీ కార్యకలాపాల కోసం విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లపై ఆధారపడుతున్నవారు డిసెంబర్ 31, 2024లోపు ‘ఔట్‌లుక్’లోకి మారాల్సి ఉంటుంది. పాప్-అప్ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లకు సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు ప్రకటనలో కంపెనీ పేర్కొంది. అయితే కటాఫ్ తేదీ వరకు సర్వీసులను యూజర్లు నిరాటంకంగా పొందొచ్చని కంపెనీ వివరించింది. కాగా 2024 ఆరంభం నుంచి మార్కెట్‌లోకి వచ్చే కొత్త విండోస్ 11 పరికరాల్లో మెయిల్ అప్లికేషన్‌గా డిఫాల్డ్‌గా ఇన్‌స్టాల్ చేసి ఉంటుందని తెలిపింది. కాగా పాత విండోస్ 11కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఉండవని వివరించింది.

ఇక ఔట్‌లుక్ వెబ్ అప్లికేషన్ యూజర్లు అధునాతన ఫీచర్లను అందిస్తోంది. ఇది వేగంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఈ-మెయిల్ సేవలతో పాటు ‘మై డే’ సెక్షన్‌లో సమగ్రమైన క్యాలెండర్, చేయాల్సిన పనుల లిస్టింగ్‌కు ఫీచర్‌ లభించనున్నాయి. ఇక ఔట్‌లుక్‌లో జీ-మెయిల్, యాహూ వంటి ప్రొవైడర్ల ద్వారా థర్డ్ పార్టీ ఈ-మెయిల్ అకౌంట్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.

  • Loading...

More Telugu News